

వేదము గో రూపమును బొంద, వేద ప్రతిపాదిత పర బ్రహ్మము గోవిందుదయ్యెనని ఆర్యోక్తి" . మన సనాతన ధర్మం మొత్తము గో ఆధారితము. "గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశి" అని వేద వాక్కు. సమస్త బ్రహ్మాండాలు ఆవు యొక్క శరీరము నందు వున్నాయి. పరబ్రహ్మ యొక్క శక్తి విశ్వముగా మారగా, పరబ్రహ్మ ఆ విశ్వమంతటా ఆవరించెను అని కదా వేద వచనం. అందుచేత పరబ్రహ్మ మహిషి అయిన తల్లి గో రూపము పొందినదని, గోవును తల్లిగా మన సంస్కృతి అభి వర్ణించింది.
గోవు విశ్వ జనులు అందరికీ తల్లి వంటిది. గోవులో చతుర్దశ భువనాలు ఉన్నాయని వేదం చెబుతోంది. అంటే గోవు పృథ్వీ రూపం అని అర్థం. “గో” శబ్దం స్వర్గానికీ, బాణానికీ, పశువుకూ, వాక్కుకూ, వజ్రాయుధానికీ, దిక్కునకు, నేత్రానికీ, కిరణానికీ, భూమికీ, నీళ్ళకూ సంబంధించింది. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఇలా చెప్పబడింది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసి కొంచెం ప్రసన్నుడైన తర్వాత దక్ష ప్రజాపతి శ్వాస నుండి సుగంధం ప్రసరించింది. ఆ సుగంధం నుండి ఒక ఆవు జన్మించింది. సుగంధం ద్వారా జన్మించుట వలన, దక్ష ప్రజాపతి ఆ ఆవుకి ‘సురభి’ అని పేరు పెట్టారు. లోకంలో గో సంతతి వ్యాప్తి చెందేందుకు సురభియే ఆధారం. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశానికి మాతగా, జననిగా పరిగణి స్తారు. సురభి రోమ కూపాల నుంచి కొన్ని లక్షలలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతే వృషభాలు (ఎద్దులు). ఋగ్వేదంలో ఆవును ”అఘణ్య” అని అన్నారు. ఆవు గురించి ఋగ్వేదంలో 4వ కాండలో 12వ సూక్తం… గో సూక్తంగా చెప్పబడింది. ఇందులో గోమాత యొక్క మ#హత్యం వివరించబడింది. శ్రీ సూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాగే గో సూక్తం కూడా పవిత్రమైనదే. గోవు రుద్రులకు తల్లిగా, వసువు లకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నేయి రూపాన అమృతంగా చెప్పబడింది.
క్షీర సాగరమధనం సమయంలో నంది, సుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్య పురాణం తెలియజేస్తోంది. వీటినే కామ ధేనువులు అని అంటారు. వంద గోవులతో కూడివున్న ఆ ధేనువు సురభిని సముద్రంలోని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చారు. తీసుకు వచ్చిన ఆ గోవు లు దట్టమైన నీలి రంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్ర వర్ణము లోను, బభ్రు వర్ణంలోను, శ్యామ వర్ణంలోనూ, ఎరుపు రంగులోనూ, పింగళ వర్ణంలోనూ ఉన్నాయని స్కాంద పురాణం చెబుతోంది.
గోవు లక్ష్మీ స్వరూపం అని చెబుతారు. లక్ష్మీ స్వరూపం అని చెప్పేందుకు ఓ పురాణ గాథ ఉంది. ఓ పర్యాయం దేవతలందరూ గోవు వద్దకు వచ్చి గోవుతో, తల్లిd మే మందరం నీ శరీరంలో నివసించడానికి కొం చెం చోటియ్యి అని అడిగారు. అప్పుడు దేవతలందరూ తన శరీరంలో నివసించడానికి గోవు చోటు ఇవ్వడం జరిగిందనేది ఆ కథ సారాంశం.
స్పర్శ మాత్రం చేత గోవులు, సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి రోజూ స్నానం చేసి గోవును స్పృశించిన వారు సర్వపాపాల నుండి విము క్తులౌతారు అని చెబుతారు. గో మయంలో లక్ష్మీదేవి, గో మూత్రంలో గంగాదేవి నివా సం ఉంటారు. గో మూత్రం, గో మయాలతో నేల పరిశుద్ధం, పరిపుష్ఠం అవుతుంది. ప్రతి దినం ఆవులకు నీరు త్రాగించి, గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందనేది శాస్త్ర వచనం.
ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మంది ఆకలి తీరుస్తుందని చెబు తారు. మనం తల్లిగా భావించే గోవు దగ్గర రోజూ కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం లాంటి పనులతో గడపటం వలన, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, గోవు ముక్కు లో ఉండే ఒక గ్రంథి ద్వారా గోవు గ్రహిస్తుంది. తరువాత మేతకు వెళ్ళినప్పుడు, రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగినవిధంగా పాలు ఇస్తుం ది, ఆ పాలు తాగడం వలన మన వ్యాధి నయం అవుతుంది. గోవును వధిస్తే ఆ రాజ్యం లో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు, శాస్త్రాలు చెబుతున్నాయి. గోమాతను కీర్తించటం, దానం చేయటం, గో రక్షణ చేయటం, గో రక్షణను ప్రోత్సహించటం, గోరక్షణ ప్రోత్సాహిక ప్రేరణం శుభప్రదమైనవి. పుణ్యప్రదమైనవి.
గోక్షీరంలో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెపుతున్నాయి. అదేవిధంగా గోవు నుదురు కొమ్ముల భాగంలో పరమ శివుడు కొలువై ఉంటాడు.అందుకే ఆవు కొమ్మలపై చల్లిన నీటిని మనపై చల్లుకోవడం వల్ల త్రివేణి సంగమంలోని నీటిని మన తలపై చల్లినంత విశిష్టత లభిస్తుందని చెబుతారు.గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉంటాడు. ఈ భాగాన్ని పూజిస్తే సంతానం లభిస్తుంది.ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారు. వీరిని ఆరాధించడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయి.ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులు కొలువై ఉంటారు వీరిని పూజించడంవల్ల చీకటి అనే అజ్ఞానం నుంచి బయటపడవచ్చు.


